Sunday, January 19, 2025

ప్రచారం చేసేందుకు ప్రతిపక్షాల జంకు…

- Advertisement -
- Advertisement -

minister srinivas goud campaign in munugode

టిఆర్ఎస్ పార్టీకి అండగా సంక్షేమ పథకాలు

కాబోయే సీఎం దత్తత వల్ల మునుగోడుకు తిరుగులేదు

ఇంటింటి ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

లింగోజిగూడెం, చౌటుప్పల్: టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు తమను ఎక్కడ తరుముతారోనని భయపడి మునుగోడు ఎన్నికల ప్రచారానికి ప్రతిపక్షాలు జంకుతున్నాయని మంతంకి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రైతుబంధు రైతు బీమా, మిషన్ భగీరథ, పింఛన్లు, కల్యాణ లక్ష్మి తదితర అనేక సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులను ఓట్లు అడిగేందుకు వెళితే తమను ఎక్కడ కొడతారోనని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డు లింగోజిగూడెంలో సిఐటియు, ఎఐటియుసి, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాబోయే ముఖ్యమంత్రి కెటిఆర్… మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నందున ఇక ఈ ప్రాంతానికి తిరుగుండదని మంత్రి తెలిపారు. మునుగోడులో ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా లభించినా, అధికార పార్టీ ఎమ్మెల్యే లేనందున ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని… భవిష్యత్తులో తిరుగులేని విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అభివృద్ధి చేసేవాళ్లు అధికారంలోకి రావాలో… కులం మతం పేరిట చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించే వాళ్లు అధికారంలోకి రావాలో జనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

రూ. 2016 ఆసరా పింఛన్లు తీసుకుంటున్న వృద్ధులు పలువురు తాము కూడా ప్రచారం చేసి తమ పెద్దకొడుకు కేసీఆర్ ను గెలిపించుకుంటామని ఈ సందర్భంగా మంత్రికి హామీ ఇచ్చారు. లింగోజిగూడెంలో స్థానికులు ప్రచారానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు నీరాజనం పలికారు. జై తెలంగాణ జై కేసీఆర్ జై టిఆర్ఎస్ అంటూ కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి వెంట రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మునుగోడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సతీమణి అరుణా రెడ్డి, కూతురు రమ్య రెడ్డి, కోడలు స్రవంతి రెడ్డి, హన్వాడ ఎంపీపీ బాలరాజు, వైస్ ఎంపీపీ మోహన్ నాయక్, హన్వాడ టిఆర్ఎస్ నాయకుడు రమణారెడ్డి, సర్పంచులు రాందాస్, సురేష్, సీపీఎం మండల పార్టీ కార్యదర్శి గంగావోని సైదులు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కల్లూరి వెంకటేష్, కౌన్సిలర్ స్వామి గౌడ్, సిపిఎం వార్డు కార్యదర్శులు బాతరాజు, ఎర్ర భూషయ్య 2వ, 3వ వార్డుల అధ్యక్షులు బొంగు నగేష్ గౌడ్, వలందాసు సతీష్ గౌడ్, ఎడ్ల మహేశ్వర రెడ్డి, కొయ్యలగుడెం వెంకటేష్, క్రాంతి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News