- Advertisement -
హైదరాబాద్: బిజెపి రేపటి దీక్ష అర్థరహితమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. యువతను బిజెపి తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. నాడు పాలమూరు వాసులు ఉపాధి కోసం వలస వెళ్లేవారు.. ఇప్పుడు ఉపాధి కోసం పాలమూరుకే వలస వస్తున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని మండిపడ్డారు. ”రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన నిరుద్యోగ దీక్ష రాజకీయ, అవకాశదీక్ష. ప్రతి ఏటా 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కేంద్ర బిజెపి ప్రభుత్వం, దేశంలో ఉన్న నిరుద్యోగులకు ఏమి చేసిందో చెప్పాలి’.? అంటూ ట్వీట్ చేశారు.
- Advertisement -