- Advertisement -
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు సిఎం కెసిఆర్ ఫిట్‌మెంట్ ప్రకటన చేస్తే బిజెపి నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ దుయ్యబట్టారు. ముప్పై శాతం ఫిట్‌మెంట్‌తో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పాత పెన్షన్ తీసివేస్తే సిఎం కెసిఆర్ పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరణ చేశారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వోద్యోగుల కంటే తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ జీతాలు ఇస్తోందని తెలియజేశారు. హోంగార్డులకు దేశంలో ఎక్కడా లేని విధంగా జీతాలు ఇస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రైవేటు రంగంలో కూడా ఉపాధి అవకాశాలు కల్పించామని, రైతు బంధు, రైతు బీమాతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు.
- Advertisement -