Wednesday, November 6, 2024

సిఎంపై ఈటల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud Comments On Etela Rajender

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. కెసిఆర్ కు, ఈటలకు ఆరేళ్లగా గ్యాప్ ఉంటే మంత్రి ఎలా అయ్యారని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కెసిఆర్, టిఆర్ఎస్ లేకుంటే ఈటల స్థానమేంటి? అని మంత్రి అన్నారు. ఈటల తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు సిఎంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హరీశ్ రావును కాదని కెసిఆర్ ఈటలకు ఫ్లోర్ లీడల్ పధవి ఇచ్చారని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. వరవరరావును జైలులో పెట్టిన పార్టీలో ఎందుకు చేరుతున్నారో చెప్పాలన్నారు. బిజెపి తెలంగాణ అభివృద్ధికి సహకరించని పార్టీ అని ఆయన విమర్శించారు. ఈటల బిజెపిలో చేరి చమురు ధర తగ్గిస్తారా అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యంగ్యస్త్రాలు సంధించారు.

Minister Srinivas Goud Comments On Etela Rajender

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News