Monday, December 23, 2024

బ్యాడ్మింటన్ క్రీడాకారుణ్ణి అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ప్రతిష్టాత్మక థామస్ కప్‌ను సుదీర్ఘ విరామం తర్వాత దేశానికి గోల్డ్ మెడల్ ను అందించిన టీం సభ్యులు పంజాల విష్ణువర్ధన్ గౌడ్‌ను రాష్ట్ర క్రీడల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. సోమవారం హైదరాబాదు తన క్యాంపు కార్యాలయంలో వారు మర్యాదపూర్వకంగా కలుసుకున్న సందర్బంగా అభినందించారు. తెలంగాణ రాష్ట్రం గర్వపడేలా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న థామస్ కప్‌ను దేశానికి అందించినందుకు అభినందించారు. అంతర్జాతీయ స్థాయి బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ లో పాల్గొనేందుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామన్నారు. అద్భుతమైన ప్రతిభను కనబరిచి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News