Monday, December 23, 2024

షూటర్ సురభికి సన్మానం

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud congratulated Indian shooter Surabhi Bhardwaj

 

మన తెలంగాణ/హైదరాబాద్: ఇటీవల జర్మనీ వేదికగా జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ పోటీల్లో రజత పతకం సాధించిన భారత షూటర్ సురభి భరద్వాజ్‌ను రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. హైదరాబాద్‌కు చెందిన సురభి జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్‌కు రజత పతకం అందించింది. మహిళల 50 మీటర్ల విభాగంలో సురభికి సిల్వర్ దక్కింది. కాగా, యువ షూటర్ సురభిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం తన కార్యాలయంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, టిజిఒ సీనియర్ నాయకులు జగన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News