Wednesday, January 22, 2025

ప్రతిభను అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

జుక్కల్ నియోజకవర్గంలోని తక్కడ్‌పల్లి గ్రామానికి చెందిన క్రీడాకారిణి ప్రతిభను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంగళవారం అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచ రికార్డు హోల్డర్ నవంబర్ నెలలో రెండు వేర్వేరు క్రీడల్లో టర్కీలో జరిగిన ప్రపంచ స్థాయి క్రీడల్లో పతకం గెలువడం, ఇంగ్లాండ్‌లో జరిగిన తైక్వాండో బ్రిటిష్ ఓపెన్ క్రీడల్లో బంగారు పతకం గెలుపొందడం ఎంతో అభినందనీయమన్నారు.

ఒక్క క్రీడలో పతకం సాధించడమే గొప్ప విషయం అనగా, ఎంతో కష్టపడి, తన సత్తాను చాటి బంగారు, వెండి పతకాలను సాధించడం గర్వకారణమన్నారు. దేశానికి ఎంతో పేరు, ప్రఖ్యాతలు తీసుకుని వస్తున్న ప్రతిభను ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. రాబోయే పోటీల్లో సైతం మరిన్ని విజయాలు సాధించాలని, ప్రభుత్వం తరపున తప్పకుండా సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News