Thursday, January 23, 2025

ఇషాసింగ్‌కు మంత్రి అభినందనలు

- Advertisement -
- Advertisement -

Minister Srinivas goud congratulated shooting athlete Ishasingh

మనతెలంగాణ/ హైదరాబాద్ : క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నామని రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రముఖ షూటింగ్ క్రీడాకారిణి ఇషాసింగ్‌ను మంత్రి అభినందించారు. ఈజిప్టు కైరోలో ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో 25 మీటర్ల జూనియర్ విభాగంలో, ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో రైఫిల్, పిస్టోల్ విభాగంలో మూడు పతకాలు సాధించిన సందర్భంగా మంత్రిని ఆమె మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో స్పోర్ట్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ఇషాసింగ్ తల్లిదండ్రులు సచిన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News