Saturday, November 9, 2024

బ్యాడ్మింటన్ క్రీడాకారులను అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సులో యూనిక్స్‌సన్ రైస్ 35వ సబ్ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ -2023 క్రీడల్లో భాగంగా ఈ నెల 14 నుండి 19 వరకు జరిగిన బాలురు, బాలికల ఛాంపియన్షిప్‌లో టైటిల్‌లను సాధించిన క్రీడాకారులను ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తాతో కలిసి క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ బ్యాడ్మింటన్ ఆడి స్ఫూర్తి నింపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశామని, తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 17వేల 560 గ్రామాలలో గ్రామీణ క్రీడా మైదానాలను నిర్మించామన్నారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా స్టేడియాలను నిర్మించామని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కప్ క్రీడలను గ్రామ, మండల జిల్లా స్థాయితో పాటు రాష్ట్రస్థాయిలో ఘనంగా నిర్వహించామన్నారు. సిఎం కప్‌ను ప్రతి ఏటా నిరంతరం జరిగేలా కార్యక్రమం రూపొందించామన్నారు. సుమారు 170 కోట్లపైబడి జనాభా కలిగిన మన దేశంలో ఒలంపిక్ పథకాలను సాధించడంలో క్రీడాకారులు మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

తెలంగాణ రాష్ట్రంలో బ్యాడ్మింటన్, బాక్సింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, హాకీ లాంటి క్రీడలకు హబ్ గా నిలుస్తోందనన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శాఖ క్రీడల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు, కోచ్ ల ను, క్రీడాకారులను ప్రొత్సహిస్తున్నామన్నారు. జ్వాలా గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాదులో అతిపెద్ద బ్యాట్మెంటన్ అకాడమీగా ప్రైవేటు రంగంలో విశిష్ట సేవలను అందిస్తున్న జ్వాలా గుత్తాను ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రాంతి గుత్తా, ఆదాయపన్ను ( ఇన్‌కంట్యాక్స్) కమిషనర్ డాక్టర్ రాజేంద్రకుమార్, పలువురు బ్యాట్మెంటన్ క్రీడాకారులు కోచ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News