Monday, December 23, 2024

క్రీడా పాఠశాల క్రీడాకారులకు మంత్రి అభినందన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ క్రీడా పాఠశాల కు చెందిన పలువురు క్రీడాకారులను రాష్ట్ర క్రీడా, పర్యాటక, యువజన సర్వీసుల శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం అభినందించారు. మే 25 నుండి 31వరకు ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో జరిగిన రోయింగ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లైట్ వెయిట్ ఉమెన్ సింగిల్స్‌లో హేమలత,

5000 ఎంటిఆర్‌ఎస్ లో స్వర్ణం , 2000 ఎంటిఆర్‌ఎస్‌లో రజిత పతకంను అలాగే ఉమెన్ పెయిర్ విభాగంలో కే.భారతి కాంస్య పతకం సాధించిన సందర్భంగా వారిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో శాట్స్ ఉన్నతాధికారులు సుజాత, దీపక్, తెలంగాణ క్రీడా పాఠశాల ఓఎస్‌డి డా హరికృష్ణ , స్పోర్ట్ స్కూల్ ఆఫీసర్ బోస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News