Monday, December 23, 2024

ఆర్చర్ అక్షితకు మంత్రి అభినందన

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇటీవల జరిగిన ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన కెవి(కేంద్రియ విద్యాలయం) విద్యార్థిని కర్నాటి అక్షిత జాతీయ ఆర్చరీ స్పోర్ట్ మీట్ ఎంపికైంది. ఈ సందర్భంగా విద్యార్థిని అక్షితను రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి అభినందించారు. మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో సత్కరించారు. ఈ పోటీల్లో అక్షిత పతకం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కురెళ్ళ వేములయ్యా గౌడ్, రాష్ట్ర బిఆర్‌ఎస్ నాయకులు అనంత రాజు గౌడ్, అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News