Monday, February 24, 2025

బ్యాడ్మింటన్ క్రీడాకారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందనలు

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud congratulates badminton players

మన తెలంగాణ / హైదరాబాద్ : థామస్ కప్‌ను కైవసం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ జట్టును రాష్ట్ర క్రీడా, ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. హైదరాబాద్‌లోని పుల్లెల గోపిచంద్ బ్యాండ్మింటన్ అకాడమిలో శిక్షణ పొంది ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక థామస్ కప్‌లో విజయం సాధించిన భారత బ్యాడ్మింటన్ జట్ల క్రీడాకారులను మంత్రి కోచ్ గోపిచంద్‌తో కలిసి అభినందనలు తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఎంతో గుర్తింపు పొందిన థామస్ కప్ భారత బ్యాడ్మింటన్ కప్ క్రీడాకారులకు గత 73 సంవత్సరాలుగా అందని ద్రాక్షగా నిలిచింది. అలాంటి థామస్ కప్‌లో అధ్భుతమైన ప్రదర్శన చేసి ప్రతిష్ఠాత్మక ఇండోనేషియా జట్టును వరస సెట్లతో ఓడించి తిరుగులేని విజయాన్ని అందించి సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న కిదాంబి శ్రీకాంత్, డబుల్స్ విజేతలు రంకిరెడ్డి, శెట్టి లను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు సాయి ప్రణీత్, సమీర్ వర్మ, హెచ్‌ఎస్ ప్రన్నోయ్, ప్రియన్స్ రాజవాట్ , సాత్విక్ సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News