Wednesday, January 22, 2025

షూటింగ్ క్రీడాకారిణి ఇషాసింగ్‌ను అభినందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud congratulates shooting athlete Esha Singh

 

మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ షూటింగ్ క్రీడాకారిణి మిస్ ఇషాసింగ్‌ను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం అభినందించారు. న్యూఢిల్లీలో డిసెంబర్ 8వ తేదీన జరిగిన 64వ జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో జూనియర్, సీనియర్, మిక్స్‌డ్ డబుల్స్‌లో 25 మీటర్ల ఫిస్టల్, ఎయిర్ ఫిస్టల్ విభాగంలో 6 మెడల్స్ సాధించిన సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ షూటింగ్ క్రీడాకారిణి ఇషాసింగ్‌ను అభినందించారు. భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించే దిశగా కృషి చేయాలని మంత్రి ఇషాసింగ్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇషా సింగ్ తండ్రి సచిన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News