Wednesday, January 22, 2025

క్రీడాకారులకు స్పోర్ట్ కిట్స్‌ను అందజేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : 36వ జాతీయ క్రీడలు 2022లో తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ స్పోర్ట్ కిట్స్‌ను అందజేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రీడా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలిసి స్పోర్ట్ కిట్స్‌ను పంపిణీ చేశారు. జాతీయ క్రీడలు గుజరాత్‌లో పెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 12 వరకు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో స్పోర్ట్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాల చారి, కార్యదర్శి జగదీష్ యాదవ్, సాట్స్ అధికారులు సుజాత, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News