హైదరాబాద్: ఉద్యోగ ఖాళీల గుర్తింపుపై గత క్యాబినెట్ లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం గా రాష్ట్ర యువజన సర్వీసులు, సెట్విన్‌తో పాటు పలు శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీల పై రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర యువజన సర్వీసులు, సెట్విన్ తదితర శాఖలో ఉన్న ఉద్యోగాల ఖాళీల పై శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యసాచి ఘోష్‌తో మంత్రి సమీక్షించారు. ఉద్యోగ ఖాళీల పునర్ వ్యవస్థీకరణపై ప్రధానం గా ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర యువజన సర్వీసులు, సెట్విన్ శాఖల్లో ఖాళీల గుర్తింపు పక్రియను వేగవంతం చేశామని ముఖ్య కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పేర్కొన్నారు. ఈ సమావేశంలో సెట్విన్ ఎండి వేణుగోపాల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Minister Srinivas Goud high-level meeting on job vacancies