Sunday, November 17, 2024

‘ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్’ ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ‘ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ డే’ సందర్భంగా హైదరాబాద్ సెంటర్ ఫర్ ఫోటోగ్రఫీ, స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాదులోని మాదాపూర్ లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ’ ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్, హైదరాబాద్ సెంటర్ ఫర్ ఫోటోగ్రఫిల అధ్వర్యంలో ప్రతి సంవత్సరం ‘ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ’ను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.

ఫోటోగ్రఫీకి చాల ప్రాముఖ్యత ఉందని, ఈ క్రమంలో ఫోటోగ్రఫి కోసం జెఎన్‌టియూ ఫైన్ ఆర్ట్ లాంటి యూనివర్సిటీలలో ఫోటోగ్రఫి కోర్స్‌లను ప్రవేశ పెట్టి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఫోటోగ్రాఫర్స్ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్‌లో హైదరాబాద్‌కు చెందిన 38 మంది ప్రముఖ ఫోటోగ్రాఫర్లు తీసిన 38 ఛాయాచిత్రాలను ఈ ఎగ్జిబిషన్ లో మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్‌లో ప్రముఖ ఫోటోగ్రాఫర్లు రవీందర్ రెడ్డి, రమేష్ బాబు, వీరేష్ విశ్వంధర్ రెడ్డి, రాధా వీరమని అతిథి తల్వార్ సత్య ప్రసాద్ లాంటి ప్రముఖ ఫోటోగ్రాఫర్లు తీసిన ఛాయాచిత్రాలను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ డా. లక్మి, ప్రముఖ ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News