Wednesday, January 22, 2025

పర్యాటక రంగానికి పూర్వ వైభవం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud Inaugurates TTF South Hyderabad

హెచ్‌ఐసిసిలో టిటిఎఫ్ ప్రదర్శన

హైదరాబాద్ : రాష్ట్రంలో పర్యటకాభివృద్ధితో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో రామప్ప దేవాలయానికి యూనెస్కో గుర్తింపు లభించిందని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో జరిగిన ట్రావెల్& టూరిజం ఫెయిర్ (టిటిఎఫ్)ను రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌సుల్తానీయాతో కలసి మంత్రి ప్రారంభించారు. టిటిఎఫ్‌లో 4 దేశాలు, 150 స్టాళ్లు, 19 రాష్ట్రాల నుంచి వచ్చిన టూరిజం ప్రతినిధులు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పర్యటకాభివృద్ధికి అనేక చర్యలను తీసుకున్నామని వెల్లడించారు. భూదాన్ పోచంపల్లికి పర్యాటక గ్రామంగా గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రాచుర్యం లభించేలా టూరిజం ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.

ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, కరివేన, ఉద్ధండ పూర్ రిజర్వాయర్ల ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశంలో అతిపెద్ద అర్బన్ ఎకో టూరిజం పార్క్ , కెసిఆర్ ఎకో పార్క్, అతిపెద్ద జలపాతాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయన్నారు. కోవిడ్ మహమ్మారి వల్ల రెండు సంవత్సరాల నుండి పర్యాటక రంగం ఎంతో నష్టపోయిందన్నారు. ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో టూరిజం రంగంలో అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి మనోహర్, ఇండియా టూరిజం రీజినల్ డైరెక్టర్ శంకర్ రెడ్డి, టిటిఎఫ్ చైర్మన్ సంజీవ్ అగర్వాల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News