Wednesday, November 6, 2024

కొత్త సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: రానున్న రోజులలో ఆర్టీసిని మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మహబూబ్ నగర్ బస్సు డిపోకు నూతనంగా కేటాయించిన సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ… ఆర్టీసి ఉద్యోగులను కూడా ఇతర ఉద్యోగుల లాగా భరోసా కల్పించే విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచిస్తున్నారని తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆర్టీసిలో అధునాతన సౌకర్యాలతో రవాణా వ్యవస్ధను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఆయన అన్నారు.

హైదరాబాద్ తర్వాత అతి పెద్ద అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటైనందున జిల్లాలో ఆర్టీసిని కూడా పటిష్ట పరిచనున్నట్లు వెల్లడించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటన్నింటిని అధిగమించేందుకు తాము కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఉద్యమంలో ఆర్టీసి ఉద్యోగులు కార్మికుల ది కీలకపాత్ర అని, వారి సంక్షేమంపైన సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసి నిదర్శనమని, ప్రైవేట్ వాహనాలలో ప్రయాణించడం సురక్షితం కాదన్నారు. భవిష్యత్తులో మహబూబ్ నగర్ పట్టణంలో సీటీ బస్సులతో పాటు, ఎలక్ట్రిక్ బస్సులను కూడా నడిపేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

స్థానిక బస్టాండ్‌ను ఆధునీకరించి ఆదర్శ బస్టాండ్‌గా తీర్చిదిద్దామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ కేసి నరసింహులు, జిల్లా రైతుబంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, రీజినల్ మేనేజర్ శ్రీదేవి, ఆర్టీసి డిపో మేనేజర్ సుజాత, ఆర్‌డిఓ నరేష్ కుమార్, డిఎస్పీ మహేష్, ఆర్టీసి నాయకులు జిఎల్ గౌడ్, జిఎస్ చారి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
పోటో :03 ఎంబిఎన్‌ఆర్ 02ఎ, బి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News