Sunday, December 22, 2024

కార్యకర్త కుటుంబంతో కలిసి మంత్రి భోజనం

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: పార్టీ కార్యకర్తలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) ఎంతటి ప్రాధాన్యమిస్తారో మరోసారి నిరూపితమైంది. శనివారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన బీఆర్ఎస్(BRS) పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పట్టణంలోని బంజారా కాలనీకి చెందిన ఇందిర అనే కార్యకర్త సమావేశంలో ప్రసంగించి తన ఆర్థిక పరిస్థితి గురించి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

Minister Srinivas Goud lunch with activist familyఆమె ఆర్థిక పరిస్థితికి చలించిన మంత్రి వారికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇందిరతో పాటు ఆమె కూతురు, కొడుకుతో కలిసి భోజనం చేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి తెలిపారు. ఓ సాధారణ కార్యకర్త అయిన తన ఆవేదనను సాక్షాత్తు మంత్రి ఇంత ఓపికగా విని ఎంతో భరోసాను ఇచ్చినందుకు ఇందిర ఆనందభాష్పాలతో కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News