Monday, December 23, 2024

ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులివ్వాలని మంత్రి ఆదేశం

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud meeting with pub owners

హైదరాబాద్: ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులు ఇవ్వాలని ఆబ్కారీ శాఖ కమిషనర్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి డెలివరీ చేయొద్దని ఈ-కామర్స్ సంస్థలకు ఆదేశించారు. ఆబ్కారీ శాఖ అధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం సమావేశం నిర్వహించారు. పబ్ యజమానులు మంత్రితో భేటీ అయ్యారు. పబ్ లలో డ్రగ్స్, ఇతర అంశాలపై మంత్రి చర్చించారు. పుడింగ్ పబ్ లో కొకైన్ దొరికిన నేపథ్యంలో ఆబ్కారీ మంత్రి ప్రత్యేక సమీక్షించి పబ్ ఓనర్లకు వార్నింగ్ ఇచ్చారు. నగరంలోని 61 పబ్ లపై ప్రత్యేక నిఘా ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News