Monday, December 23, 2024

తెలంగాణ టూరిజం @ రూ. 100 కోట్ల టర్నోవర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ టూరిజం రూ. 100 కోట్ల టర్నోవర్ సాధించిందని పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ మేరకు పర్యాటక భవన్ లో బుధవారం తెలంగాణ పర్యాటక శాఖ ఉద్యోగుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ , ఎండి మనోహర్‌తో పాటు ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ టూరిజం 100 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిన సందర్భంగా సంస్థ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి కేక్ ను కట్ చేసి ఉద్యోగులను అభినందించారు. ఈ సందర్బంగాద మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ పర్యాటక శాఖకు ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో లీజులు తీసుకొని నిబంధనలు పాటించని, బకాయిలు చెల్లించని సంస్థలపై చర్యలు చేపట్టామని, తెలంగాణ టూరిజంకు రావలసిన బకాయిలను సుమారు 60 కోట్లు రూపాయల పైగా వసూలు చేశామన్నారు.

వేల కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకుని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. పర్యాటక శాఖకు చెందిన నిరుపయోగంగా ఉన్న పర్యాటక కేంద్రాలను వినియోగంలోకి తేవడానికి అధికారులు కృషి చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం లో అనేక పర్యాటక ప్రదేశాలు, యునెస్కో గుర్తింపు పొందే అవకాశం ఉన్న ప్రదేశాలు చాలా ఉన్నాయన్నారు. గత 20 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు లభించి ఉంటే ఇంకా ఎంతో అభివృధి జరిగేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు టూరిజం ప్రమోషన్ ను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఉన్న పర్యాటక ప్రదేశాలను పరిరక్షణ కు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నడుస్తున్న పర్యాటక కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తున్నామని వివరించారు. అలాగే సంస్ధ అభివృద్ధికి ఉద్యోగులు చిత్తశుద్ధి తో పనిచేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సూచనల మేరకు టూరిజం అభివృధికి కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇప్పటికే టూరిజం శాఖకు ప్రోత్సాహం అందిస్తోందన్నారు. సిఎం కెసీఆర్ కృషితోనే రామప్ప దేవాలయం కు యునెస్కో గుర్తింపు లభించిందన్నారు. భూదాన్ పోచంపల్లి గ్రామానికీ వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్‌గా ఎంపికైందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News