Sunday, January 19, 2025

ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై చర్యలు చేపట్టాలి

- Advertisement -
- Advertisement -
అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న వ్యక్తులను గుర్తించి కేసు నమోదు చేయాలి
అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘాను మరింత పెంచాలి
హర్యానా రాష్ట్రానికి చెందిన 339 మద్యం బాటిళ్ల స్వాధీనం
పిడి యాక్ట్ నమోదు చేసిన ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు
వివరాలను వెల్లడించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్ : సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అక్రమంగా మద్యాన్ని సరఫరా చేస్తున్న వ్యక్తులను గుర్తించి వారిపై పిడియాక్ట్ కేసులను నమోదు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని నివారణంచేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద వివిధ మార్గాల ద్వారా వస్తున్న రవాణా వ్యవస్థ కట్టుదిట్టంగా విస్తృత తనిఖీలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ముషీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో హర్యానా రాష్ట్రానికి చెందిన 339 బాటిల్‌ల అక్రమ మద్యాన్ని జార్ఖండ్‌కు చెందిన రాజారామ్ సింగ్ దగ్గర స్వాధీనం చేసుకోవడంతో మొదటిసారిగా పిడి కేసు నమోదు చేయడంతో దీనికి సంబంధించిన వివరాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎయిర్ పోర్టు రైల్వే బస్సు ఇతర ప్రజా రవాణా, పార్శిల్ సర్వీసులపై నిఘా ఉంచి మద్యం అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో ఫంక్షన్ హాల్లో కన్వెన్షన్ హాల్‌లో మ్యారేజ్ హాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యం సరఫరా కాకుండా చూడాలని మంత్రి సూచించారు.

ఈవెంట్ కంపెనీల నిర్వాహకులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యాన్ని సరఫరా చేయకుండా సహకరించాలని మంత్రి కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడైనా అక్రమ మద్యం సరఫరా అవుతున్న, సరఫరా చేస్తున్న వ్యక్తుల వివరాలను ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు మంత్రి సూచించారు. 339 విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న ముషీరాబాద్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ గౌడ్ ను మంత్రి అభినందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ మహమ్మద్ ముషారఫ్ ఫరూఖీ, అదనపు కమిషనర్ అజయ్ రావు జాయింట్ కమిషనర్ శాస్త్రి, సికింద్రాబాద్ ఈఎస్ పవన్ కుమార్, ఏఈఎస్ శ్రీనివాస్ రావు, ఇన్‌స్పెక్టర్ శివజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News