Sunday, December 22, 2024

కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని అందుకోసం ప్రతి ఒక్కరు ఉద్యమించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఓబిసి స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన కుల గణన కోసం లక్ష పోస్టు కార్డుల ద్వారా పది లక్షల ట్వీట్ లతో

మహా ఉద్యమాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ‘కుల గణన కోసం ఉద్యమిద్ధాం’ అనే వాల్ పోస్టర్ ను హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఓబిసి స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కిరణ్ కుమార్ , తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రావణ్, తెలంగాణ గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, తెలంగాణ సగర సంగం అధ్యక్షుడు శేఖర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News