Thursday, November 14, 2024

గ్యాస్ మంటలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వంట గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, వంటావార్పు కార్యక్రమాలు, ఆం దోళనలను ఉధృతంగా చేశారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. గురువా రం తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఈ కా ర్యక్రమంలోమంత్రులు,ఎంపిలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మం త్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు మాట్లాడు తూ కేంద్రం తీసుకునే నిర్ణయాలతో పేద లు ఇబ్బందులు పడుతున్నారని, వచ్చే ఎ న్నికల్లో కచ్చితంగా బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతారని వారు పేర్కొన్నా రు. అన్ని వర్గాలను ప్రధాని మోడీ మోసం చేస్తున్నారని వారు విమర్శించారు. బిజెపి అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

ఇప్పటికే ప్రజలను బిజెపి పార్టీ నిండా ముంచిందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ ఘ ట్‌కేసర్‌లో బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కా ర్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రం అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డీ విరుస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తా వద్ద గురువారం మంత్రి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నల్లదుస్తులు ధరించి కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ‘బిజెపి హటావో దేశ్ కి బచావో’ అంటూ నినాదాలు చేశారు.
కరీంనగర్ పట్టణంలో కట్టెల పొయ్యిలపై…
గ్యాస్ ధరలను నిరసిస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, మున్సిపల్ కార్పొరేషన్ల చైర్మన్లు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. కరీంనగర్ పట్టణం తెలంగాణ చౌక్‌లో రోడ్లపైనే కట్టెల పొయ్యిలపై వంటావార్పు నిర్వహించి భోజనాలు చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
9 సంవత్సరాలుగా ప్రజలకు ఇబ్బందులు: మంత్రి వేముల
పెంచిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ లో బిఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, మేయర్ నీతూ కిరణ్, జడ్పీ చైర్మన్ విఠల్ రావు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గడిచిన 9 సంవత్సరాలుగా ప్రజలను ఇబ్బందులు పెడుతుందని మంత్రి వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ పట్టణం నెహ్రూ సెంటర్‌లో…
మహబూబాబాద్ పట్టణం నెహ్రూ సెంటర్‌లో ఎమ్మెల్యే బాణోత్ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో….
నల్లగొండ జిల్లాలోని త్రిపురారం మండల కేంద్రంలో ఖాళీ గ్యాస్ సిలిండర్లతో బిఆర్‌ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, ట్రైకర్ చైర్మన్ ఇస్లాత్ రామచంద్రనాయక్, మహిళలు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో..
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంచడాన్ని నిరసిస్తూ కేంద్రమైన సంగారెడ్డిలో బిఆర్‌ఎస్ నాయకుల నిరసన తెలిపారు. టిఎస్‌ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, పట్నం మాణిక్యం తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ధరలను పెంచి మహిళలను మోసం చేసింది: మంత్రి ఎర్రబెల్లి
మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి మహిళలను మోసం చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ గ్యాస్ ధరలు తగ్గించకపోతే ప్రజలు మోడీని గద్దె దించడం ఖాయమని ఆయన తెలిపారు. తెలంగాణ రైతులు బాయిల్డ్ రైస్ పండిస్తుండగా కేంద్ర ప్రభుత్వం రా రైస్ మ్రాతమే కొంటామని మొండికేస్తుందని ఆయన ఆరోపించారు.
బిజెపి ప్రభుత్వంపై మంత్రి సబితారెడ్డి నిప్పులు
గ్యాస్ ధర పెంపుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ నాయకులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలో మోడీ డౌన్ డౌన్ అంటూ మహిళలు నినదించారు. కట్టెల మోపును తలపై మోస్తూ ర్యాలీలో పాల్గొని బిజెపి ప్రభుత్వంపై మంత్రి సబితారెడ్డి నిప్పులు చెరిగారు. రానున్న ఎన్నికల్లో పొరపాటున కమలం గుర్తుకు ఓటు వేస్తే కట్టెల పోయి వస్తదని, పేదల జేబులు ఖాళీ అవుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.
దేశ భవిష్యత్ అధోగతి పాలు : హోంమంత్రి
ట్యాంక్‌బండ్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద, ఆజంపుర చౌరస్తాలో జరిగిన ధర్నాలో గ్యాస్ ధరలు పెంచినందుకు నిరసనగా హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అత్యవసరమైన గ్యాస్ ధరలను పెంచుతూ పేదలపై భారం మోపిందన్నారు. ఎనిమిదేళ్లలో రాష్ట్రం ప్రతి రంగంలోనూ అద్భుతంగా అభివృద్ధి చెందుతుండగా, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల దేశ భవిష్యత్ అధోగతి పాలైందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News