మహబూబ్ నగర్: భక్తుల కొంగుబంగారమైన మన్యం కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సందర్శన కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం అత్యధునాతన రోప్ వే ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.దేవాలయం కు వెళ్ళేదారిలో వరహా స్వామి భారీ విగ్రహం ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని ,మన్యం కొండ దేవాలయం లో నిత్యాన్నదాన సత్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. కల్యాణ కట్ట, కోనేరు అభివృద్ధి, మోడ్రన్ పద్ధతిలో స్టాల్స్ ఏర్పాటు, VIP గెస్ట్ రూమ్ ల నిర్మాణం పై వెంటనే ప్రతిపాదనలు రూపొందించాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు.
సిఎం కెసిఆర్ గారి అదేశాల మేరకు దక్షిణ తెలంగాణ లో ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మన్యం కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి పై రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డా. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన కార్యాలయం లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష లో మన్యం కొండ దేవాలయం కు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో అత్యధునాతన రోప్ వే నిర్మాణం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వీటితో పాటు దేవాలయంకు భక్తులు వచ్చే దారిలో వరహా స్వామి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. దేవాలయం ఆగమ శాస్త్రం ప్రకారం, దేవాలయం ప్రాశస్త్యం కు అనుగుణంగా అభివృద్ధి పనులు జరిగేలా పండితులు, వాస్తు ప్రకారం నిర్మాణాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
మన్యం కొండకు తరలివచ్చే వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఆధునిక కిచెన్ తో పాటు నిత్యాన్నదాన సత్రాన్ని నిర్మించాలని మంత్రి ఆదేశించారు. వీటితో పాటు కల్యాణ కట్ట, కోనేరు అభివృద్ధి, నూతన స్టాల్స్ ఏర్పాటు, VIP గెస్ట్ రూమ్ ల నిర్మాణం లపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ చర్చించారు. అధికారులు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. గతంలో మన్యం కొండ లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బడ్జెట్ హోటల్, పర్యాటకుల,భక్తుల కోసం రూమ్ ల నిర్మాణం, కల్యాణ మండపం, భోజన శాల నిర్మాణ పనుల పై చర్చించారు. పనులను వేగవంతం చేయాలని అందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
వీటితో పాటు మహబూబ్ నగర్ పట్టణంలోని న్యూగంజ్ లోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అభివృద్ధి, అప్రోచ్ రోడ్డు నిర్మాణం పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులతో చర్చించారు. ఈ సమీక్ష సమావేశం లో పర్యాటకాభివృద్ధి సంస్థ MD మనోహర్, TSTDC ఇంజినీరింగ్ అధికారులు, టూరిజం ప్రాజెక్ట్ కన్సల్టెంట్స్ BK తాటి & బాలకృష్ణ, టూరిజం అధికారులు పాల్గొన్నారు.