Monday, December 23, 2024

ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud Review on Prohibition and Excise

ఖమ్మం: రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా వైరా లో స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ గారితో కలసి జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ పనితీరు పై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో గుడుంబా, గంజాయి, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాను సమర్ధవంతంగా అరికట్టాలని ఆదేశించారు. గుడుంబాను సమర్ధవంతంగా అరికట్టడం లో కృషి చేసిన ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులను ఈ సందర్భంగా అభినందించారు.

అలాగే అదే స్ఫూర్తితో గంజాయి సాగు, అక్రమ రవాణా ను అరికట్టి గంజాయి రహిత రాష్ట్రం గా తీర్చిదిద్దాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమర్ధవంతంగా విధులను నిర్వహించే అధికారులను, సిబ్బందిని గుర్తించి ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపల్ చైర్మన్ జైపాల్, కొండబాల వెంకటేశ్వర రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రొహిబిషన్,  ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీ అంజన్ రావు, సోమిరెడ్డి, సిఐలు రమ్యరెడ్డి, రాజు, సర్వేష్, రాంప్రసాద్, నాగేశ్వరరావు, జుల్పికర్, విజయేందర్, జయశ్రీ, ఎస్ఐలు పలువురు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News