కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బృందం
క్రీడాకారుడు రవికుమార్‌తో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్ : కామన్వెల్త్ క్రీడల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనపై అధ్యయనం చేసి రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి అనుగుణంగా ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌ను పరిశీలించటానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షులు జగన్మోహన్‌రావు, రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ అల్లపురం వెంకటేశ్వరరెడ్డి, నవీన్ బృందం ఇంగ్లాండ్‌లోని బర్మింగ్ హామ్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా కామన్వెల్త్ మెగా టోర్నీ నిర్వహణ, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనపై బృందం ప్రతినిధులు అధ్యయనం చేయనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామని మంత్రి తెలిపారు. బర్మింగ్‌హామ్‌కు వెళ్తున్న బృందానికి శంషాబాద్ విమానాశ్రయం వద్ద రాష్ట్ర క్రీడా పాఠశాలకు చెందిన క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు.
దుబాయ్ విమానాశ్రయంలో…
కామన్వెల్త్ క్రీడలను పరిశీలించడానికి బర్మింగ్ హామ్‌కు వెళ్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను దుబాయ్ విమానాశ్రయంలో టోక్యో – 2020 ఒలింపిక్స్‌లో రెస్లింగ్ క్రీడలో ఫ్రీ స్టయిల్ 57 కెజిల విభాగంలో కాంస్య పతకం సాధించిన రవికుమార్‌దహియా కలిశారు. అక్కడి నుంచి బర్మింగ్ హామ్‌కు ఒకే విమానంలో కలసి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తరహాలో కామన్వెల్త్ లో గోల్డ్ మెడల్ సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.