Saturday, December 21, 2024

దేశవ్యాప్తంగా కుల గణన.. ఓబిసిల సమస్యల పరిష్కారం చేపట్టాలి

- Advertisement -
- Advertisement -
వాల్ పోస్టర్ ఆవిష్కరణలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కుల గణన, ఓబిసిల సమస్యలను పరిష్కరించాలని , ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం బిసిల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యాటక , క్రీడా శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రత్యేక మంత్రి లేని కారణంగా కేంద్రంలో ఓబిసి వర్గానికి చెందిన ప్రధానమంత్రి ఉన్నా ఓబిసిలకు ఒరిగిందేమీ లేదన్నారు. సిఎం కెసిఆర్ , ఓబిసిలకు రాజకీయ రిజర్వేషన్లు పెంపుదల , మహిళా బిల్లు , కుల గణన చేపట్టాలని రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా పార్లమెంటు లో బిల్లు పెట్టలేదన్నారు. దేశవ్యాప్తంగా కుల గణన , ఓబిసిల సమస్యల పరిష్కారం కోసం జూలై 15న హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా కన్వెన్షన్ క్యాస్ట్ సెన్సెస్ అండ్ ఓబిసి ఇష్యూస్ పై రూపొందించిన వాల్ పోస్టర్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.

కేంద్ర ప్రభుత్వం కులగణన, బిసిల సమస్యల పరిష్కారం చేపట్టాలని దేశంలోని వివిధ యూనివర్సిటీల ఓబిసి విద్యార్థి నేతలు చేపట్టిన ఆందోళనను ఆయన సమర్థించారు. మెజారిటీ జనాభా ఉన్నా బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేంద్రంలో ఏర్పాటు చేయాలన్నారు. జనాభా లెక్కలలో కుల గణన అప్షన్ పెట్టడం వల్ల ఎలాంటి ఖర్చు లేకుండా కుల గణన చేపట్టవచ్చునన్నారు. తెలంగాణ లో బిసి,ఎస్‌సి, ఎస్‌టిల సంక్షేమానికి, అభివృద్ధికి సిఎం కెసిఆర్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారన్నారు. బిసిల స్థితిగతులు, వృత్తులు ఎవరి చేతులలో ఉంది ? జనాభా పరంగా రిజర్వేషన్లు అందించటానికి వివరాలు వంటివి కుల గణన వల్లే సాధ్యం అవుతాయన్నారు.

బిసిల ఆర్థిక స్థితగతులు తెలుసుకోవాలంటే దేశంలో బిసిల గణాంకాలను తేల్చాలన్నారు. దేశంలో ఓబిసిల లెక్కలు తేల్చాలని యూనివర్సిటీ విద్యార్ధులు చేస్తున్న ఆందోళనను సమర్థిస్తున్నామన్నారు. కేంద్రం బిసిల సమస్యల పరిష్కారం, కులగణన చేపట్టాలంటూ దేశంలోని వివిధ యూనివర్సిటీలలో విద్యార్థులు చేస్తున్న డిమాండ్‌ను స్వాగతిస్తున్నామన్నారు. ఓబిసిలు మెజారిటీ జనాభా ఉన్నా జనాభా లెక్కలలో కుల గణన అప్షన్ పెట్టడం వల్ల ఎలాంటి ఖర్చు లేకుండా కుల గణన చేపట్టవచ్చు అని వెల్లడించారు. కుల గణన చేపడితే గనుక ఓబిసిల స్థితిగతులు తేలనున్నాయన్నారు. అంతే కాకుండా రాజకీయ, ఉద్యోగాలు అందించటానికి రిజర్వేషన్ల వివరాలు కుల గణన వల్లే సాధ్యం అవుతుందన్నారు. ఇప్పటికీ దేశంలో ఓబిసిల ఆర్థిక స్థితగతులు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఓబిసి స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి. కిరణ్ కుమార్, జాతీయ కోశాధికారి ఓ. కొండల్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News