Wednesday, January 22, 2025

బడుగుల జీవితాల్లో సర్కారు వెలుగులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో తెలంగాణ సర్కారు వెలుగులు నింపుతోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సర్వాయి పాపన్న పోరాట స్పూర్తితో బిసిలు మరింత ముందుకు వెళ్లాలని ఆయన ఆకాక్షించారు. హైదరాబాద్ వనస్థలిపురంలో సాహెబ్ నగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ . తెలంగాణలో వెనుకబడిన వర్గాల కులవృత్తుల్లోని చేతి వృత్తి దారుల్లో ప్రమాణాలు పెంచడానికి సిఎం కెసిఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బిసిలకు లక్ష పథకం పూర్థి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. బిసిల్లో గౌడ, కల్లుగీత వృత్తిదారులతో పాటు ఇతర వృత్తిదారుల పట్ల ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బహుజనులు ఆర్థికంగా బలపడుతుంటే బిజెపి, కాంగ్రెస్ పార్టీల నేతలు తమ అక్కసును వెళ్లగక్కుతూ విమర్శిస్తున్నారని ఆయన విమర్శించారు.

బహుజనులను ఎవరిని కించ పరిచినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఎల్‌బినగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. కులవృత్తులకు జీవం పోస్తు ప్రతి కార్మికుడు కార్మికునిగానే మిగిలి పోకుండా యజమాని కావాలనే ఉద్దేశంతో సిఎం కెసిఆర్ నిరుపేద కుటుంబాలకు బీసీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు. బిసి బంధు పథకం ద్వారా బిసిలకు ఆర్థిక సహాయం అందించడమనేది ఇకపై కొనసాగే ప్రక్రియని దరఖాస్తు దారులు తమకు రాలేదని ఎవ్వరూ నిరాశా నిస్పృహలకు లోను కాకూడదని తెలిపారు.

మిగిలిన వారికి కూడా బిసి బంధు ఇస్తామని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గీత పారిశ్రామిక సహకార సంస్థ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ , గౌడ కల్లుగీత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఛైర్మన్ బాలగోని బాల్‌రాజ్ గౌడ్, సాహెబ్ నగర్ గౌడ సంఘం అధ్యక్షులు కొత్త మహేష్ గౌడ్, బొమ్మగాని ప్రభాకర్ గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్, ఆయిలి వెంకన్న గౌడ్, ముద్దగోని సరస్వతి రామ్మోహన్ గౌడ్, ఈశ్వరమ్మ యాదవ్ , కూరెళ్ళ వేములయ్య గౌడ్, రామ్మోహన్ గౌడ్, ఎక్సైజ్ అధికారులు చంద్రయ్య గౌడ్, రవీందర్రావు, టిజిఓ నాయకులు జగన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News