Saturday, November 2, 2024

అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud unveiling the national flag

దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం
రాష్ట్రంలో జోనల్ విధానం పూర్తి అయ్యింది
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కార్యాలయంలో 73 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమతతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జోనల్ విధానం పూర్తి అయ్యిందన్నారు.

నిరుద్యోగులకు అవకాశం కల్పించేందుకు ఉద్యోగులు సంయమనం పాటించాలని మంత్రి సూచించారు. సిఎం కెసిఆర్ ఉద్యోగుల పక్షపాతిగా ఆయన అభివర్ణించారు. ప్రతి సంవత్సరం ఉద్యోగుల క్యాలండర్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం తగిన కార్యాచరణను రూపొందిస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఏ. సత్యనారాయణ, కోశాధికారి పుల్లెంల రవీందర్ కుమార్, సహదేవ్, రవీందర్ రావు, అరుణ్‌కుమార్, వెంకటయ్య, ఎంబి కృష్ణ యాదవ్, గండూరి వెంకట్, డా. హరికృష్ణ, లక్ష్మణ్ గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి గౌడ్, లక్ష్మణ్ గౌడ్, సబిత, సుజాత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News