Wednesday, January 22, 2025

వారం రోజుల్లో సస్పెన్షన్ బ్రిడ్జి ప్రారంభం…

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలో ట్యాంక్ బండి వద్ద సర్వాంగ సుందరంగా నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జిని వారం రోజుల్లో ప్రారంభిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం నాడు ఆయన జిల్లా అధికార యంత్రాంగం తో కలిసి సస్పెన్షన్ బ్రిడ్జిని పరిశీలించారు. ట్యాంక్ బండ్ మధ్యలో ఉన్న ఐలాండ్ చుట్టూరా ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన తర్వాత సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం ఉంటుందని అందుకే వారం రోజుల్లో అక్కడ చేపట్టాల్సిన పనులన్నింటిని పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

పర్యాటకులు సస్పెన్షన్ బ్రిడ్జి మీదుగా ఐలాండ్ వరకు చేరుకుని అక్కడ కొద్దిసేపు ఉండేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ట్యాంక్ బండ్ సుందరీకరణ, ఐలాండ్ అభివృద్ధి పనులను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ప్రారంభించుకుంటామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రవి నాయక్, ఎస్పీ నరసింహ, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, కమిషనర్ ప్రదీప్ కుమార్ తదితరులు మంత్రి వెంటే ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News