Monday, December 23, 2024

రేపు సత్తుపల్లి లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటన

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లిఃః రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీస్‌ల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ శనివారం సత్తుపల్లి నియోజకవర్గంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఉదయం గం. 9.00లకు కల్లూరు ఇండోర్ స్టేడియం ప్రారంభోత్సవం, ఉదయం గం. 10.30లకు వేంసూరు మండలం, వెంకటాపురంలో బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో, సాయంత్రం గం. 3.00లకు సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.

ముఖ్య అతిధులుగా రాష్ట్ర రవాణ శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్షనేత ఎంపి నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సి తాతా మధుసూధన్, జట్పి చైర్మన్ లింగాల కమల్‌రాజ్, జిల్లా డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం హాజరు కానున్నారని, కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News