- Advertisement -
హైదరాబాద్ : విజయవాడ కనకదుర్గమ్మను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం నాడు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో, ఆనందంగా జీవించాలని బెజవాడ దుర్గామల్లిశ్వరి అమ్మ వారిని కోరుకున్నట్లు తెలిపారు.
భౌతికంగా రెండు రాష్ట్రాల ప్రజలు విడిపోయినప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలు మరింత బలంగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలనే సంకల్పం విజయవంతం కావాలని సిఎం కెసిఆర్‌కి భగవంతుడు మరింత శక్తి ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు.
- Advertisement -