Wednesday, January 22, 2025

డాక్టర్ అవ్వాలమ్మ…

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud who fed rice to student

విద్యార్థినికి గోరుముద్దలు తినిపించిన మంత్రి

కోటకదిర: మహబూబ్ నగర్ గ్రామీణ మండలం కోటకదిర జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అక్షయపాత్ర ద్వారా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. ఈ క్రమంలో శివాని అనే తొమ్మిదో తరగతి విద్యార్థినికి మంత్రి గోరుముద్దలు తినిపించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినందుకు శివాని… మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. విద్యార్థిని చురుగ్గా, ధైర్యంగా మాట్లాడటం గమనించిన మంత్రి చక్కగా చదువుకొని డాక్టర్ అవ్వాలన్నారు. కష్టపడి చదివితే అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి ఆశీర్వదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News