నూతన సంవత్సరం 2023 సందర్భంగా ఎక్సైజ్, టూరిజం, యువజన, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణా రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, టిజీవో అధ్యక్షురాలు మమత, హైదరాబాద్, మంత్రుల నివాస ప్రాంగణంలోని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఆయన చాంబర్లో కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, స్త్రీ నిధి మేనేజింగ్ డైరెక్టర్ విద్యా సాగర్ రెడ్డి గారు కూడా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేల పరిధిలోని తమ శాఖ తరపు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకొస్తే సత్వరం పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టిజీవోల క్యాలెండర్, డైరీ -2023ని, ఎంపిడీఓల డైరీ 2023ను ఆవిష్కరించారు. ములుగులో మరిన్ని గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేయాలని ఎంపిడిఓలు కోరగా సిఎం కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.