Tuesday, January 21, 2025

షూటింగ్ క్రీడకు ప్రోత్సాహం

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Goud with shooting sportsman

 

హైదరాబాద్ : షూటింగ్ క్రీడకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ క్రాస్‌బో షూటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రాస్‌బో షూటింగ్ ఛాంపియన్ షిప్‌ను రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించేందుకు సహకారాన్ని అందించాలని మంత్రిని వారు కోరారు. రాష్ట్రం నుంచి మొదటి సారిగా గోల్డ్ మెడల్ సాధించిన లక్ష్మీ చైతన్య, సిల్వర్ మెడల్ సాధించిన భువనేశ్వరిలను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర బాస్కెట్ బాల్ హెడ్ కోచ్ జార్జి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుమన్‌కుమార్, పవన్‌కుమార్, ఇర్మీయా, అభిలాష పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News