Wednesday, January 22, 2025

క్రీడాకారిణి సింధు తపస్విని సన్మానించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Gowd honors sportsperson Sindhu Tapaswini

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ సిటీలో మార్చి 11 నుంచి 13వ తేదీ వరకు జరిగిన ఇంటర్నేషనల్ టైక్వాండో టోర్నమెంట్‌లో కాంస్య పతకాన్ని, అమెరికాలోని డల్లాస్‌లో మార్చి 19 నుంచి 21వ తేదీ వరకు జరిగిన ఇంటర్నేషనల్ టైక్వాండో టోర్నమెంట్‌లో రెండు రజత పతకాలను సాధించిన హైదరాబాద్‌కు చెందిన ఇంటర్నేషనల్ టైక్వాండో క్రీడాకారిణి సింధు తపస్విని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో తపస్విని సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు కుమార్తె సింధు తపస్వి అంచలంచెలుగా ఎదుగుతూ హైదరాబాద్‌లో మెరుగైన శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయి వేదికలపై రాణించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టిజిఓ కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత, కోశాధికారి పుల్లెంల రవీందర్‌కుమార్ గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News