- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బేగంపేటలోని పాత ఎయిర్‌పోర్ట్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మేడారం జాతర సందర్భంగా హైదరాబాద్ నుంచి మేడారంకు వెళ్లే హెలికాప్టర్ సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాస రాజు, టూరిజం ఎండి మనోహర్, రాష్ట్ర ఏవియేషన్ డైరెక్టర్ భారత్ రెడ్డిలు పాల్గొన్నారు.
- Advertisement -