Monday, December 23, 2024

వేలమంది వీరుల త్యాగాల ఫలితం..స్వేచ్చాయుత భారతావని ఆవిర్భావం…

- Advertisement -
- Advertisement -

Minister Srinivas Yadav inaugurated National Flag presentation

హైదరాబాద్ : నెక్లెస్ రోడ్ లోని సంజీవయ్య పార్క్ లో భారత జాతీయ పతాకంలో ఆవిర్భావం నుండి జరిగిన మార్పులు, చేర్పులను వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేటి తరానికి చెందిన అనేక మందికి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానీయుల గురించి, జాతీయ పతాకం రూపొందించడానికి జరిగిన కృషి గురించి తెలియదు. 11 సార్లు మార్పులు జరిగిన తర్వాత ప్రస్తుతం మన ఉపయోగిస్తున్న జాతీయ పతాకం రూపుదిద్దుకుందన్నారు. స్వాతంత్ర పోరాట వీరులను స్మరించుకుంటూ 75 సంవత్సరాల వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం అని తెలిపారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ గురించి విద్యార్థులకు తెలియజేసేందుకే గాంధీ చిత్రాన్ని ప్రభుత్వం ఉచితంగా థియేటర్ లలో ప్రదర్శిస్తుందని మంత్రి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News