Monday, January 20, 2025

కళాసిగూడ ఘటనను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్: సికింద్రాబాద్ లోని కళాసిగూడ వద్ద ప్రమాదవశాత్తు తెరిచి ఉంచిన నాలాలో చిన్నారి మౌనిక పడి మృతి చెందింది. కళాసిగూడలో ఘటనాస్థలికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ వెళ్లి పరిశీలించారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తామని,ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు.

సోదరుడిని కాపాడే క్రమంలో ప్రమాదం జరిగినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా చిన్నారి మృతికి మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. మౌనిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి వెల్లడించారు. ఈ సంబంధించిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News