Monday, December 23, 2024

నన్ను చదివించండి సర్…

- Advertisement -
- Advertisement -

Minister Srinivasgoud supports Poor student

మైసమ్మ వద్ద మంత్రి చేయి పట్టుకుని వేడుకున్న బాలుడు

చదువు పట్ల బాలుడి శ్రద్ధ, ఆవేదనకు చలించిన మంత్రి

వెంటనే బాలుడి బాధ్యతలను తీసుకున్న మంత్రి

ప్రైవేటు పాఠశాలలో చేర్పించిన మంత్రి

హైదరాబాద్ : ఈ బాలుడి పేరు విజయ కుమార్. తల్లిదండ్రులు మల్లెల వెంకటేష్, మల్లెల బుజ్జమ్మ. వీరిది కాకర్లపాడ్. ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేక బడికి వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో మైసమ్మ వద్ద కూల్ డ్రింక్స్ అమ్ముతున్నాడు. ఆదివారం నాడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మైసమ్మ వద్ద పూజకు వచ్చారు. కూల్ డ్రింక్ విక్రయిస్తున్న బాలుడు విజయ కుమార్…మంత్రిని చూసి వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళి చేయిపట్టుకుని నన్ను చదివించండి సర్ అంటూ ఏడుపు అందుకున్నాడు. పిల్ల వాడి ఆర్తి మంత్రిని కదిలించింది. చదువుకునాలనే బాలుడి శ్రద్ధ, అందుకు పడుతున్న ఆవేదనను గమనించి వెంటనే బాలుడిని తన వాహనంలో ఎక్కించుకున్నాడు. తన పక్కనే కూర్చోబెట్టుకుని అన్ని వివరాలు తెలుసుకున్నారు.

అక్కడికక్కడే పట్టణంలో మంచి పేరున్న రిషి విద్యాలయం వాళ్లకు ఫోన్ చేసి బాలుడిని ఆరో తరగతి లో చేర్చుకుని హాస్టల్ వసతితి పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎంత ఖర్చు అయినా తాను భరిస్తానని తెలిపారు. బాలుడికి అవసరమైన దుస్తులు, ఇతర వస్తువులన్నీ కొనాలని తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. బాలుడిని జీవితంలో స్థిరపడేలా చేస్తామని అంత వరకు తానే బాధ్యత తీసుకుంటానని మంత్రి తెలిపారు. తన సొంత కుమారునిలా విద్యాబుద్ధులు అందిస్తామని తెలిపారు. బాలుడికి దుస్తులు, పుస్తకాలు, బూట్లు, ఇతర వస్తువులన్నీ ఇప్పించారు. బాలుడి తల్లితండ్రులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. బాలుడు తన వద్దకు వచ్చి అడిగిన విధానం, చదువు పట్ల బాలుడికి ఉన్న శ్రద్ధ తనను కదిలించి వేసిందని మంత్రి తెలిపారు. బాలుడు జీవితంలో ఉన్నతంగా స్థిరపడేలా చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు పేదల పట్ల ఉన్న అభిమానానికి బాలుడి బాధ్యత చిన్న ఉదాహరణ మాత్రమేనని స్థానికులంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News