Monday, December 23, 2024

సునాక్‌కు మరో చిక్కు

- Advertisement -
- Advertisement -

Minister switches sides from Rishi Sunak to Liz Truss

ట్రసు వైపు ప్లేటు ఫిరాయింపు

లండన్ : బ్రిటన్‌లో ఓ మంత్రి ప్లేటు ఫిరాయించారు. ప్రధాని రేసుకు సాగుతున్న పోరులో ఇప్పటివరకూ రిషిసునాక్ వైపు ఉన్న సీనియర్ మంత్రి సర్ రాబర్ట్ బక్‌లాండ్ తాను లిజ్ ట్రసు పాలసీలను విశ్వసిస్తున్నానని తెలిపారు. ది డైలీ టెలీగ్రాఫ్ పత్రికలో ఓ వ్యాసంలో ఈ విషయం వెల్లడించారు. దేశాన్ని తిరిగి సక్రమ రీతిలోకి తీసుకువచ్చేందుకు ముందుకు నడిపించేందుకు ట్రసు అత్యంత సమర్థులని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ప్రచారపు తొలిరౌండ్లలో సునాక్‌కు ఈ మంత్రి మద్దతు పలికారు. అయితే తాను ఇరువురు పోటీదార్ల వైఖరిని తెలుసుకోవడం వారి ప్రచారాల దశలో వ్యక్తం అవుతోన్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఇద్దరిలో ఇప్పుడు ఒకరిని ఎంచుకోవడం జరిగిందని తెలిపారు. దేశానికి ఏదైతే అవసరమో, దానిని సాధించే క్రమానికి తాను మద్దతు ఇవ్వడం తప్పదని తన వ్యాసంలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News