హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతిబింభమైన బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం పరేడ్ గ్రౌండ్ లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు భక్తులు ఎలాంటి ఇబ్బందులు లే కుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని పేర్కొన్నారు. ఈ నెల17 వ తేదీన జరిగే సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు లక్షలాది మంది భక్తులు రానున్నారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైనా బోనాలు, బతుకమ్మ వంటి అనేక ఉత్సవాలను అనేక దేశాలలో జరుపుకోవడం మనకెంతో గర్వకారణం అన్నారు. పండుగల విశిష్టతను మరింత పెంపొందించే విధంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు పండుగలను ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఈ ఏడాది ఘనంగా బోనాలు: మంత్రి తలసాని
- Advertisement -
- Advertisement -
- Advertisement -