- Advertisement -
హైదరాబాద్: టిఆర్ఎస్ కార్యకర్త అంటేనే గౌరవమైన పదవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నామినేట్ పోస్టులు రాలేదని అసంతృప్తితో ఉండటం సహజం అన్నారు. ఎనిమిది ఏళ్లలో అనేక సంక్షమ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపుతోనే ఆత్మయ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎవరి తాటాకు చప్పుళ్లకు టిఆర్ఎస్ భయపడదన్నారు. టిఆర్ఎస్ నేతలను ఇబ్బందిపెట్టే ప్రయత్నం జరుగుతోందని తలసాని ఆరోపించారు. హైదరాబాద్ టిఆర్ఎస్ అడ్డా అని మంత్రి తలసాని పేర్కొన్నారు. మంత్రి మల్లారెడ్డి పట్ల ఐటి అధికారులు అనైతికంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -