హైదరాబాద్: కేంద్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదని ,కేసిఆర్ తెలంగాణను సాధించుకున్నారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనపై మంత్రి తలసాని మాట్లాడుతూ చావునోట్లో తలపెట్టి కేసిఆర్ తెలంగాణ సాధించుకున్నారన్నారు. రైతుసంఘర్షణ సభ కాంగ్రెస్ అంతర్గత సభలా ఉందన్నారు. మద్దుతు ధర ఇస్తామన్నారేగాని అది రాష్ట్రానికా లేక దేశానికా అని చెప్పలేదన్నారు. 40ఏళ్ల పాటు పాలించిన కాగ్రెస్ పార్టీ అప్పుడెందుకు ఇవ్వలేదన్నారు.
రైతులను ఆదుకునేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువచ్చిందన్నారు.కాళేశ్వరం బెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా గుర్తింపు వచ్చిందన్నారు. రైతులకు ఎదో చేస్తామనేవారు ముందు అధ్యయనం చేసి మాట్లాడాలన్నారు. టూరిస్టుల్లాగా వచ్చి మాట్లాడుతున్నారన్నారు. బిజేపి నేత నడ్డా, కాంగ్రెస్ నేత రాహుల్ సభలకు పర్మిషన్ ఇచ్చారని తెలిపారు.కొన్ని చోట్ల అక్కడి పరిస్థితులు అక్కడి ఇంచార్జీలు అనుమతులు ఇవ్వాలన్నారు. ఓయూలో పరీక్షలు జరుగుతున్నాయని ,అందుకే విసి అనుమతి ఇవ్వలేదన్నారు. జైల్లో ములాఖత్‌కు అధికారులు అనుమతి ఇవ్వాలని, అది వారి పరిధిలో ఉన్న అంశమే తప్ప ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.