రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపడానికి ప్రెస్‌మీట్లు
సిఎం కెసిఆర్‌పై గవర్నర్
తమిళిసై చేసిన వ్యాఖ్యలు..
ఆమె విజ్ఞతకే
పెడుతున్నాం తమిళి
ఏదిపడితే అది మాట్లాడడం
సరైనది కాదు: గవర్నర్‌కు
మంత్రి తలసాని శ్రీనివాస్
యాదవ్ హితవు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యాంగపరమైన హోదాలో ఉండి రాజకీయ పరమైన మాటలు మాట్లాడడం గవర్నర్ తమిళిసైకి తగదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుతాన్ని నిందించడం కోసమే ఆ మె ప్రత్యేకంగా మీడియా సమావేశాలను ఏర్పాటు చేస్తుండడం పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చే శారు. పైగా ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పనిచేయడం తనకు ఇష్టం లేదని చెప్పడం గవర్నర్‌కు సరికాదని తలసాని వ్యాఖ్యానించారు. గవర్నర్ రాజకీయాలు మా ట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాజ్యాంగ పరిధికిలోబడి నడుచుకుంటే మంచిదని సూచించారు. ఏదిపడితే అది మాట్లాడటం సరికాదన్నారు. సి ఎంపై చేసిన ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ, తమిళిసై రాజకీయ పరమైన మాటలు మాట్లాడుతు న్నారన్నారు.
ప్రజల ఆదరాభిమానాలతో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై విపక్ష నాయకులు చేసినట్లు ఆరోపణలు చేయడం గవర్నర్ స్థాయిని దిగజార్చే విధంగా ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం మాదన్నారు. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని తలసాని వ్యాఖ్యానించారు. గవర్నర్‌గా వారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని తలసాని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి కంటే గవర్నర్ అనే రోల్ చాలా తక్కువన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి వారే ప్రోటోకాల్ విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయని వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి తలసాని గుర్తుచేశారు. ఉపరాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలను గవర్నర్ తెలుసుకొని మాట్లాడాలని తలసాని సూచించారు. రాజ్యాంగ పరమైన విధానంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? అని ప్రశ్నించారు. దీనిపై వారి విధానాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు.