Monday, December 23, 2024

10 ఏళ్లలో ఎంతో అభివృద్ధి.. దేశానికే తెలంగాణ రోల్ మోడల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ సిటీ బ్యూరో: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కే దక్కుతుందని సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం బేగంపేట డివిజన్‌లోని ఎన్‌బిటి నగర్, వడ్డెర బస్తీ, గౌతమ్ నగర్, ఓల్ పాటిగడ్డ, నూర్ బాగ్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆయన ఎన్‌బిటి నగర్ లో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ప్రచార రధాన్ని ప్రారంభించి పావురాలను ఎగురవేశారు. ప్రచారం లో అడుగడుగునా ప్రజలు బ్రహ్మరధం పట్టారు. మహిళలు నుదుటన కుంకుమ తిలకం దిద్ది మంగళ హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా ఇండ్ల పై నుండి తమ అభిమాన నాయకుడి పై పూల వర్షం కురిపించారు. సనత్ నగర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసి, ప్రజల కష్టాలను తీర్చిన శ్రీనన్న ఈ సారి కూడా మీకే మా ఓటు అంటూ ప్రకటించారు. భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రచారంలో పలువురు ఓటర్లు పేర్కొన్నారు.

10 ఏళ్లలో ఎంతో అభివృద్ధి…
పేద, మద్య తరగతి ప్రజల కోసం ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో అనేక సంక్షేమ కార్యాక్రమాలతో పాటు ఎన్నో అభివృద్ది పనులను చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పేద ప్రజలు అధికంగా నివసించే పాటి గడ్డలో స్థానిక ప్రజల కోసవ రూ.6 కోట్లలవ్యయంతో మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్ ను నిర్మించామని తెలిపారు. అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను కూడా ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నామని తెలిపారు. గతంలో ఇక్కడి నుండి ప్రాతినిద్యం వహించిన వారు ఎన్నికల అనంతరం ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదని పేర్కొన్నారు. కానీ తాను నిరంతరం ప్రజల మద్యనే ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, సంక్షేమ కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని చెప్పారు.

పని చేసే వారిని ఆదరించండి:  తలసాని సాయి కిరణ్ యాదవ్
నిత్యం ప్రజల మద్య ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్న వారిని ఆదరించాలని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ కోరారు. మంగళవారం బేగంపేట డివిజన్ లోని ఓల్ పాటిగడ్డ, నూర్ బాగ్ లలో ఇంటింటికి తిరుగుతూ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఈనెల ౩౦న జరిగే ఎన్నికలలో కారు గుర్తుపై ఓటేసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞఫ్తి చేశారు. ఈ ప్రచారంలో కార్పొరేటర్ టి.మహేశ్వరి, డివిజన్ బిఆర్‌ఎస్ అద్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, జనరల్ సెక్రెటరీ ఆరీఫ్, నాయకులు నరేందర్, శ్రీహరి, శేఖర్, అఖిల్, అక్బర్, మోహిన్, రాజు, శ్రీను, ఖాలీద్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News