Friday, November 22, 2024

మోడీకి కెటిఆర్ భయం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కేవలం ఆయన భ్రమ

మోడీకి దమ్ముంటే పార్లమెంటును రద్దు చేయాలి
సిఎం కెసిఆర్‌తో మాట్లాడి అసెంబ్లీని రద్దు చేయిస్తాం
ఎన్నికలకు కలిసివెళ్దాం ఎవరు గెలుస్తారో చూద్దామా?
తెలంగాణ దేశానికి దావోస్‌లో
పెట్టుబడులను ఆకర్షించిన కెటిఆర్ దేశానికి
నాయకత్వం వహిస్తారని భయపడుతున్నారా? : మంత్రి
గంగుల, విప్ ప్రభాకర్, ఎంఎల్‌ఎలు మాగంటి
గోపీనాథ్, కాలేరు వెంకటేశ్‌లతో కలిసి మీడియాతో
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి నేతలపై రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. రాష్ట్రంలో మార్పు జరగడం అన్నది….కేవలం వారి భ్రమ అని వ్యాఖ్యానించారు. మోడీకి ద మ్ముంటే పార్లమెంట్‌ను రద్దు చేయాలి. కెసిఆర్‌తో మాట్లాడి తాము రాష్ట్ర అసెంబ్లీ ర ద్దు చేయిస్తామన్నారు. ఎన్నికలకు కలిసి వెళదాం…. ఎవరు గెలుస్తారో చూద్దామా? అని మంత్రి తలసాని సవాల్ విసిరారు. మ్రైకవారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్, శాసనమండలి విప్ ఎం. ఎస్ ప్రభాకర్, శాసనసభ్యులు మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేష్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తలసాని మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మరోసారి తెలంగాణపై తన అక్కసును ప్రదర్శించారని మండిపడ్డారు. మోడీ ఎక్కడికి వెళ్లినా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు… ఆయనకు స్వాగతం పలకడానికి వెళ్లడం లేదన్నారు. దీనిపై మోడీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని మంత్రి తలసాని సూచించారు. అందరినీ స్వాగతించే సంప్రదాయం తెలంగాణదన్నారు.

కానీ భారత్ బయోటెక్‌కి మోడీ హైదరాబాద్‌కు వచ్చినపుడు సిఎంను రావొద్దని ఆయనే చెప్పారన్నారు. అక్కడే కొత్త సంప్రదాయానికి బీజం పడిందని తలసాని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కాదు అనే చెప్పే ధైర్యం మోడీ ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణకు ఈ ఎనిమిదేళ్లలో ఏం చేశారో మోడీ చెప్పాలని మంత్రి తలసాని మరోసారి డిమాండ్ చేశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకివ్వలేదు? ఐటిఐఆర్ ఎందుకు కేటాయించడం లేదు? మోడీ ఓ పహిల్వాన్ అనుకుంటున్నారా? సాటి మనుషులతో మాట్లాడటం లేదు, డ్రామాలు వేస్తున్నాడని విమర్శించారు. అయినా మోడీకి మాట లేదు…. మతి లేదు. కనీసం సొంత పార్టీ నాయకులతో కూడా మాట్లాడలేని దుస్థితి మోడీదని దుయ్యబట్టారు.
కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్న నరేంద్రమోడీ….. మా మంత్రి కెటిఆర్‌ను చూసి భయపడుతున్నాడా? అని ప్రశ్నించారు. లేక దావోస్‌లో పెట్టుబడులు ఆకర్షిస్తున్న కెటిఆర్ రేపు దేశానికి నాయకత్వం వహిస్తారన్న భయం పట్టుకుందా? అని నిలదీశారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు పది డ్రెస్‌లు మార్చడం తప్ప దేశానికి ఈ ఎనిమిదేళ్లలో మోడీ చేసింది శూన్యమని వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి అమలు చేస్తోందని ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్దాలు చెప్పడం ఒక్క మోడీకే చెల్లిందన్నారు. ఇంత చిల్లరగా గతంలో ఏ ప్రదాని కూడా మాట్లాడలేదన్నారు. కేంద్ర పథకాలకు పేర్లు మార్చాల్సిన గత్యంతరం టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి లేదన్నారు. దమ్ముంటే కేంద్రం నిరూపించాలని సవాల్ విసిరారు. అసలు దేశంలో ఎక్కడైనా తెలంగాణలో ఉన్న పథకాలు అమలు అవుతున్నాయా? అని ప్రశ్నించారు. మోడీకి దమ్ముంటే దేశానికి 24 గంటల కరెంట్, మిషన్ భగీరథకు నిధులు, పాలమూరు ఎత్తిపోతలకు నిధులు ఇస్తున్నట్లు ప్రకటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ పథకంలో కేంద్రం వాటా ఎంతో చెప్పగలరా? అని మోడీని ఉద్దేశించి తలసాని ప్రశ్నించారు. మోడీ చుట్టపు చూపులా వచ్చి తిట్టి పోతే పడటానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరన్నారు. తెలంగాణలో పుట్టిన వారు బిజెపికి, మోడీకి భయపడరన్నారు.

మోడీ తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరు

దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని మంత్రి తలసాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు…చేపడుతున్న అభివృ-ద్ధి పథకాలే రేపు దేశవ్యాప్తంగా అమలు జరుగుతాయన్నారు. మోడీ తాటాకు చప్పుళ్లకు ఇక్కడ బెదిరేవాళ్ళు ఎవరు లేరన్నారు. మోడీ తన పద్దతి మార్చుకోవాలన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాల అధికారాలను గుంజుకునే అధికారం మోడీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. దేశం ఆయన జాగీరా? రాష్ట్రాల హక్కులు కాలరాస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నయా పైసా సాయం చేయని మోడీ మమ్మల్ని విమర్శిస్తారా? అని తలసాని ప్రశ్నించారు. అసలు మూఢ నమ్మకాలకు బిజెపియే పెట్టింది పేరన్నారు. యుపి ఎన్నికల్లో ఓట్ల కోసం మూఢ నమ్మకాలను వాడుకున్నది ఎవరిని? నిలదీశారు.

బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ రెచ్చ గొట్టే వ్యాఖ్యలకు మోడీ ఆయనకు క్లాస్ పీకుతారు అనుకున్న…. కానీ అలా జరగలేదన్నారు. సిఎంల ఎంపిక రాజ్యాంగబద్దంగా జరుగుతుంది కానీ బిజెపి చెప్పినట్టు కాదని మంత్రి తలసాని అన్నారు. టిఆర్‌ఎస్ కుల పార్టీనా? మొదటి నుంచి బిజెపియే కుల పార్టీ….కుటుంబ పార్టీ అని తలసాని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొడుకు బిసిసిఐ కార్యదర్శి ఎలా అవుతాడని ప్రశ్నించారు. అది కుటుంబ రాజకీయం కాదా? అని తలసాని నిలదీశారు. ఇప్పటికైనా నరేంద్రమోడీ తన స్థాయి దిగజార్చుకుని మాట్లాడవద్దన్నారు. ప్రధానిగా హుందాగా ఉంటే మంచిదని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News