Wednesday, January 22, 2025

గ్రంధాలయాల పాఠకులకు శుభవార్త చెప్పిన మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Minister Talasani gave good news to readers of libraries

 

హైదరాబాద్: గ్రంధాలయాల పాఠకులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభవార్త చెప్పారు. ఇకనుండి గ్రంధాలయాలు ఉదయం 8 నుండి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని లైబ్రరీల అభివృద్ధిపై మంత్రి తలసాని బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, టిఎస్ఇడబ్ల్యూఐడిసి చైర్మన్ శ్రీధర్ రెడ్డి, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్, నగర చైర్మన్ ప్రసన్న, గ్రంథాలయ అధికారులు పాల్గొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తలసాని పేర్కొన్నారు. అవసరమైన గ్రంధాలయాల వద్ద అన్నపూర్ణ భోజన కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News