Friday, November 22, 2024

ఆపదలో బాలల రక్షణకు.. బాల రక్షక్ వాహనాలు: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Minister Talasani inaugurated child rescue vehicles

హైదరాబాద్: ఆపదలో ఉన్న బాలల రక్షణకు ప్రభుత్వం బాల రక్షక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద హైదరాబాద్ జిల్లాకు మంజూరైన రెండు బాల రక్షక్ వాహనాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టర్ శర్మన్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆపదలో ఉన్న బాలల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం 1098 హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయడంతోపాటు జిల్లాకు ఒకటి చొప్పున సిఎస్‌ఆర్ నిధులతో బాలరక్షక్ వాహనాలను కేటాయించిందని చెప్పారు. హైదరాబాద్ జిల్లాకు కేటాయించిన రెండు వాహనాలను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు.

అనాధ బాలలు, భిక్షాటన చేస్తూ 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కడ కనిపించినా బాల్య వివాహం జరుగుతున్నా కానీ 1098 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని కోరారు. హెల్ప్ లైన్ కు కాల్ వచ్చిన వెంటనే ప్రొటెక్షన్ ఆఫీసర్, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ అధికారులు బాలరక్షక్ వాహనంతో సంఘటనా స్థలానికి చేరుకొని వారిని రక్షిస్తారని తెలిపారు. ఈ బాలలకు బాల సదనంలో చేర్చి వారికి వసతి, బోజన సౌకర్యం కల్పిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ వివరించారు. పరిస్థితులను బట్టి పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారుల సహకారం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మహిళా శిశుసంక్షేమ శాఖ పర్యవేక్షణలో బాల రక్షక్ వాహనాలు నిర్వహించబడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ సుమలత, సికింద్రాబాద్ సిడిపిఓ సునంద, ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News